రామగిరి, జూలై 29 : అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జేఎన్టీయూ కళాశాలకు చెందిన మెకానికల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఆర్ కృష్ణ ఆధునిక పద్ధతులను ఉపయోగించి సృష్టించిన 10 త్రీడీ డిజైన్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన అధికారిక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్ కార్యాలయ బాధ్యులు ఈ 10 త్రీడీ డిజైన్స్ హక్కులను కృష్ణ పేరు మీద నమోదుచేశారు.
14 ఏండ్ల నుంచి త్రీడీ కళపై చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ డిజైన్స్‌కు యూకే పేటెంట్ హక్కులు రావడం గర్వంగా ఉందని కృష్ణ తెలిపారు. ఎన్నో సాంకేతిక విజ్ఞాన శాస్ర్తాలలో త్రీడీ కళ కూడా ఒకటని, తనకు సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన మెకానికల్ ప్రొఫెసర్ శ్రీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.