వేతన.. యాతన
యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రాకపోవడంతో ఆచార్యులు, అధ్యాపకులకు ఏడేండ్లుగా రూ.130 కోట్ల మేర కేంద్రం బాకీ పడింది
అందని ద్రాక్షగా.. యూజీసీ 7వ వేతన సవరణ
ఏడేండ్లుగా పెంచిన వేతనం ఇవ్వని మోదీ సర్కారు
ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్లకు రూ.130 కోట్ల బకాయి
రాష్ట్రం వాటా చెల్లింపునకు ముందుకొచ్చిన తెలంగాణ
కేంద్రానికి పలుమార్లు లేఖలు.. స్పందన శూన్యం
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ ): యూనివర్సిటీ ఆచార్యులు, డిగ్రీ కాలేజీ అధ్యాపకుల వేతన సవరణ కాగితాలకే పరిమితమైంది. ఏండ్లు గడుస్తున్నా పెంచిన వేతనాలను మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 7వ పేస్కేల్ అమల్లోకి రాకపోవడంతో ఆచార్యులు, అధ్యాపకులకు ఏడేండ్లుగా రూ.130 కోట్ల మేర కేంద్రం బాకీ పడింది. బకాయిల్లో తన వాటా చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి, పలుమార్లు లేఖలు రాసినా కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదు. వర్సిటీల్లోని ఆచార్యులు, డిగ్రీ అధ్యాపకుల వేతన సవరణకుగాను కేంద్రం యూజీసీ 7వ పేస్కేల్‌కు ఆమోదం తెలిపింది. సవరించిన వేతనాలు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణలోని ఆచార్యులకు సైతం 2016 జనవరి 1 నుంచి వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది.
దీంట్లో 50శాతం కేంద్రం వాటాగా ఇవ్వాలి. కానీ 2019 మార్చి 31 వరకు చెల్లించాల్సిన మొత్తం రూ.130.09 కోట్లు కాగా, మోదీ సర్కారు ఇప్పటివరకు వాటా చెల్లించలేదు. సవరించిన పేస్కేల్ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు 2019 జూన్ 20న జీవో 15ను విడుదల చేసి, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణను అమలు చేస్తూ వస్తున్నది. 2016 జనవరి నుంచి 2019 మార్చి వరకు చెల్లించాల్సిన మొత్తాన్ని మోదీ సర్కారు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో.. వర్సిటీ ఆచార్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. అయితే రూ.130.09 కోట్లను రీయింబర్స్ చేయడంపై కేంద్రం చేతులెత్తేసింది. ఇక ఇస్తామన్న డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బకాయిలనూ పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినా.. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందనలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా ఏప్రిల్ 6న కేంద్రానికి మరో లేఖను రాశారు.పేస్కేల్ బకాయిల కింద ఒక్కొక్క ప్రొఫెసర్‌కు రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు రావాల్సి ఉన్నదని, కేంద్రం వాటిని విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రాగి మల్లికార్జున్‌రెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- commission
- Pay revision
- salary
- UGC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

