ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 1: కాంట్రాక్ట్ విధానంలో అనేక ఏండ్ల నుంచి బోధన, పరిపాలనాపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమకు తక్షణమే యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకుడు ఈ ఉపేందర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదు నెలల క్రితం యూజీసీ వేతనాలు (బేసిక్+డీఏ+హెచ్ఆర్ఏ+3 శాతం ఇంక్రిమెంట్) వర్తింపజేయాలని ఆదేశించారని గుర్తుచేశారు. అయినా ఇప్పటికీ వర్సిటీల అధికారులు అమలు చేయకపోవడం శోచనీయమని వాపోయారు. న్యాయం జరగకపోతే న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేస్తామని ప్రకటించారు.
మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు
హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లోజు సత్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్‌రావును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పొడిశెట్టి రమేశ్‌కుమార్, బొడ్డుపల్లి అంజయ్య సుజాత, సంయుక్త కార్యదర్శులుగా టీ రత్నప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, నాగేందర్, యాదగిరి, కోశాధికారిగా రవికుమార్ ఎన్నికయ్యారు.