హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సీఐఎస్ఆర్ యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2025 డిసెంబర్ సెషన్ నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. ఆసక్తి గల వారు అక్టోబర్ 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 18న పరీక్ష నిర్వహిస్తారు. పీజీ సబ్జెక్టులో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వివరాల కోసం https:// csirnet.nta.ac.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత వెబ్ ఆప్షన్ల గడువును కాళోజీ నారాయణ రావు హెల్త్ వర్సిటీ పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు(శనివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈనెల 29 ఉదయం 11 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్థులకు సూచించింది. వరంగల్లోని ఫాదర్ కొలొంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 2025-26 విద్యాసంవత్సరానికి 150 సీట్లను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) రెన్యూవల్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.