హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ప్రగతి భవన్‌లోని జనహితలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది వేడుకల నిర్వహణపై మంగళవారం బీఆర్కేభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతిభవన్‌లో శనివారం ఉదయం 10.30కి ప్రారంభమవుతాయని తెలిపారు. వేదపండితుల ఆశీర్వచనం, బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ పంచాంగ పఠనం ఉంటాయని పేర్కొన్నారు. వేదపండితులకు ఉగాది పురసారాలు అందజేసిన తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సందేశం ఇస్తారని చెప్పారు. ఉగాది రోజు సాయంత్రం 6.30కి రవీంద్రభారతిలో కవిసమ్మేళనం ఉంటుందని తెలిపారు.