హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : యూజీ ఆయుష్(బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్)లో తొలి విడత కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లకు కాళోజీ హెల్త్ వర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు https://tsbahnu.tsche.in. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కోరింది. https://www.knruhs.telangan a. gov.in సందర్శించాలని పేర్కొంది.
బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెఎంఎస్) మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అయింది. 226 మందితో కూడిన లిస్టును ప్రకటించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్టు తెలిపింది.