చెన్నూర్ టౌన్, మార్చి 30 : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణి సంయుక్తంగా సోమవారం విచారణ జరిపారు. పాఠశాలలో జరిగిన ఘటనపై సిబ్బంది, బాలికలతో మాట్లాడారు.
ఈ విషయమై కలెక్టర్‌తో పాటు సొసైటీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు జోనల్ అధికారి గిరిజ వివరించారు. అజాగ్రత్తగా వ్యవహరించినందుకు ఇద్దరు ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి తొలగించామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.