Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
ఆదివారం సెలవు రోజును ఆనందంగా గుడుపుదామునుకున్న ఆ విద్యార్థులకు అదే చివరి రోజుగా మారింది. సరదగా స్నేహితులతో గడుపదామని బయటకెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా మారడం పలువురిని కంటతడిపెట్టించింది.
శామీర్ పేట్ : ఆదివారం సెలవు రోజును ఆనందంగా గుడుపుదామునుకున్న ఆ విద్యార్థులకు అదే చివరి రోజుగా మారింది. సరదగా స్నేహితులతో గడుపదామని బయటకెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా మారడం పలువురిని కంటతడిపెట్టించింది. సరదా కోసం బయటకి వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు నీట మునగగా.. మరో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాప్రల్ ప్రాంతానికి చెందిన రోహిత్ (18), సీవీఆర్ కాలేజీలో చదువుతున్న సయాన్ (18) సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న రక్షిత్, పియూష్, మురారి ఐదుగురు కలిసి ఆదివారం సెలవు కావడంతో మల్కారం పరిధిలోని క్వారీ గుంతల వద్ద సరదాగా గడపడానికి వెళ్లారు.
ఉదయం భోజనం తరవాత పక్కనే ఉన్న క్వారీ గుంతలో ప్లేట్స్ కడగడానికి వెళ్లి ప్రమాదవశత్తు ఇద్దరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థుల మృతితో యాప్రాల్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

