కొడిమ్యాల, ఆగస్టు 26: 2022-23 యాసంగి, 2025-26 వానకాలానికి సం బంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్ దుర్వినియోగం చేసిన రైస్‌మిల్లుల నిర్వాహకులపై కేసు న మోదు చేసినట్టు కొడిమ్యాల ఎస్సై అనుమండ్ల నరేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.14.76 కోట్లు, అ మృత ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.5.02 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ దుర్వినియోగం చేశారని టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ ఆర్రగోవుల జితేంద్రప్రసాద్ ఫిర్యాదు చేశారు. హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్ అమృత ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్వాహకులపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.