హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల నుంచి అమాయకులైన యువకులను కంబోడియా, మయన్మార్, లావోస్ దేశాల్లోని సైబర్ ముఠాలకు అప్పగించిన రాకెట్లో.. మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ శిఖాగోయెల్ శనివారం తెలిపారు.
బాధితులు ఇచ్చిన 23 ఫిర్యాదులపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విచారణ జరిపి.. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన కొలనాటి నాగశివ అలియాస్ జేమ్స్ (36)ను మే 19న అరెస్టు చేశారు. మరో నిందితుడు గుజరాత్ పోర్బందర్కు చెందిన హితేశ్ అర్జనా సౌమ్య (29)ను తెలంగాణ సీఎస్బీ ఢిల్లీలో అరెస్టు చేసింది. ఇతనిపై మానకొండూరులో కేసు నమోదైంది. ఈ అరెస్టుల్లో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని శిఖాగోయెల్ అభినందించారు.