లింగాల, ఆగస్టు 24 : కుటుంబసభ్యురాలి మరణవార్త తెలుసుకొని అంత్యక్రియలకు బయలుదేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాదం కబళించింది. నాగర్‌కర్నూల్ జిల్లా రాయవరానికి చెందిన లావుడ్య లలిత(50) అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది. ఆదివారం నిద్రలో గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషయ తెలుసుకున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ(29), అల్లుడు నాగరాజు(25) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుంచి సొంతూరుకు బయలుదేరారు.
నల్లగొండ జిల్లా డిండి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొన్నది. దీంతో చంద్రకళ, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన శ్రీకాంత్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.