దౌల్తాబాద్/చిలుకూరు, డిసెంబర్ 20: విద్యుత్తు షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన తుమ్మల ఎల్లం (50) వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లాడు. బోరు స్టార్టర్ ఫ్యూజు వైరు సరిచేస్తుండగా షాక్‌కు గురై అకడికకడే మృతిచెందాడు. కాగా సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బాలాజీనగర్డౌన్ కోళ్లఫారం వద్ద జానకీనగర్కు చెందిన భూక్యా రామకృష్ణ (37) పొలంవద్ద మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.