ములుగు రూరల్, మే 12: ఎన్నికల విధులకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న స్వామి, మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన నీలయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద చేపట్టిన ఎన్నికల సామగ్రి పంపిణీకి హాజరయ్యారు. స్వామి సొమ్మసిల్లిపోవడంతో అతని కంటికి,నోటికి తీవ్ర గాయాలయ్యాయి. నీలయ్య సైతం అస్వస్థతకు గురికాగా అధికారులు వీరిని ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అనారోగ్యంతో ఉన్నా రమ్మన్నారు
వారం రోజులుగా తీవ్ర జ్వరం వస్తున్నదని నీలయ్య పేర్కొన్నారు.ఆరోగ్యం సరిగా లేదని అధికారులకు తెలిపినా ఏటూరునాగారంలో ఎన్నికల విధులు నిర్వర్తించాలని, లేదంటే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరు కాగా కండ్లు తిరిగి కిందపడిపోయానని, వాంతులు అవుతున్నాయని తెలిపాడు. తనను ఇంటికి పంపించాలని ఆయన ఉన్నతాధికారులను వేడుకున్నారు.