Accident | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సమీపంలోని టేక్రియాల్ వద్ద జాతీయ రహదారి 44 పై రెండు కంటైనర్లు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న రాజస్థాన్ లారీని వెనకాల నుంచి దూసుకొచ్చిన మరో కంటైనర్ ఢీకొట్టింది. ఈ కంటైనర్ మహారాష్ట్రకు చెందినది. ఈ ప్రమాదంలో రెండు కంటైనర్లు ధ్వంసం కాగా డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.