Nalgonda | Nalgonda | ప్రైవేటు బస్సు సడన్ బ్రేక్.. ఒకేసారి ఢీకొన్న నాలుగు వాహనాలు
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల సమీపంలోని పెద్దకాపర్తి వద్ద ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనక వస్తున్న కారు.. బస్సును ఢీకొట్టింది. దానివెనుక వెస్తున్న కంటైనర్.. కారును ఢీకొట్టడంతో అది బస్సు కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోకారు అదుపుతప్పి డివైడర్‌ను గుద్దింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రమాదం వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

