హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో తెలంగాణ విద్యాకమిషన్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. రాష్ట్రంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం జీవో కూడా జారీచేసింది. శిక్షణ మాత్రం.. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఉంటుందని ప్రకటించారు. ఈ వింత ఉత్తర్వులు విద్యాశాఖలో చర్చనీయాంశమయ్యాయి.