నారాయణపేట : వారిద్దరికీ వేరొకరితో పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలున్నారు. కాని వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న ఘటన నారాయణ పేట జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్, అరుణ అలియాస్ శ్రావణి చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
వివాహేతర సంబంధం తోనే వారు మృతి చెందినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య తో పాటు కుమారుడు ఉండగా, అరుణకు భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.