హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్ పేరిట సోషల్ మీడియా ద్వారా భారీ మోసానికి పాల్పడిన కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని టీజీసీఎస్బీ పోలీసులకు పట్టుబడ్డారు. రాహుల్ దంగి, రాహుల్ భోయ్ అనే నిందితులను ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించినట్టు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయెల్ ఆదివారం ప్రకటించారు. స్టాక్ ట్రేడింగ్ పేరిట తన నుంచి దశలవారీగా రూ.8.14 కోట్లు మోసం చేసినట్టు బంజారాహిల్స్‌కు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. రాహుల్ దంగి కరెంట్ ఖాతాకు బాధితుడి నుంచి రూ.75 లక్షలు బదిలీ అయ్యాయని పోలీసులు తేల్చారు. రాహుల్ దంగికి దేశవ్యాప్తంగా 35 నేరాలతో సంబంధం ఉన్నదని, ఆయన ఖాతా ద్వారా రూ.3.7 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. మరో నిందితుడు రాహుల్ భోయ్‌ని అకౌంట్ సప్లయర్‌గా గుర్తించారు.