మిర్యాలగూడ, ఫిబ్రవరి 2: విలేకరుల ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ ఎడిటర్ అని చెప్పుకుంటున్న ఆనంద్‌కుమార్, తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీఐ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని నెల రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సదరు సీఐ ఆ ముగ్గురిని సంప్రదించి కథనాలు ఆపాలని కోరగా రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. సీఐ స్నేహితుడు ఆంజనేయులు కలిసి రూ.1.10 లక్షలు ఇచ్చాడు. మళ్లీ డబ్బులు కావాలని సీఐని బెదిరించడంతో ఎస్పీ శరత్చంద్రపవార్కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు