హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది.
ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, కోశాధికారి పీ యోగానంద్, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, టెమ్జూ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యార నవీన్‌కుమార్ సంయుక్తంగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించే వ్యక్తులు ఎంతటివారైనా సరే ఊపేక్షించవద్దని కోరారు. మహిళలు, విధి నిర్వహణలో ఉన్నారనే కనీస విచక్షణ లేకుండా దాడికి పాల్పడి, అసభ్యంగా ప్రవర్తించిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.