హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25వేల కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుం కాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు.
బుధవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి తుమ్మల కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కుమ్రంభీం, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను పీఎండీడీకేవై పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.