హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వేసవి రద్దీ కారణంగా తగ్గించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరిగి పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. పెంచిన కోటాను ఆగ స్టు, సెప్టెంబరు నెలల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్టు ఆదివారం టీటీడీ అధికారులు తెలిపారు. అదే విధంగా స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.