హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.