చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు భారీ నజరానా అందజేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మహిళలకు ఇవాళ 5 వేలు బదిలీ చేసినట్లు సీఎం ఎంకే స్టాలిన్(CM Stalin) తెలిపారు. కలైగనార్ మగలిర్ ఉరిమై తోగై స్కీమ్ కింద నగదును ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క రోజే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6550 కోట్లు పంపిణీ చేసింది. సీఎం స్టాలిన్ మరో ప్రకటన కూడా చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే, సహాయ నగదును రెండు వేలకు పెంచనున్నట్లు చెప్పారు. కేఎంయూటీ స్కీమ్ కింద గత మూడు నెలలకు చెందిన మూడు వేలతో పాటు వన్‌టైం సమ్మర్ రిలీఫ్ కింద అదనంగా మరో రెండు వేలు కలిపి మహిళల అకౌంట్లలో డిపాజిట్ చేశారు.
లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా ఆ అమౌంట్‌ను బదిలీ చేశారు. ఈ స్కీమ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు. ఎన్నికల నియమావళి సాకుతో నిధులను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. డీఎంకే సర్కారు కేఎంయూటీ స్కీమ్ కింద ప్రతి నెల అర్హులైన మహిళలకు వెయ్యి రూపాయులు తమ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయనున్నది. ఒకవేళ తాము కూడా అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెల రెండు వేలు ఇవ్వనున్నట్లు అన్నాడీఎంకే నేత పళనిస్వామి ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే.