హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని కరీంనగర్, దుబ్బాక, మంథనిలో ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి పవిత్రతను మరింత పెంచాలని బోర్డు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
నిత్యాన్నదాన ట్రస్టుకు లక్ష విరాళం
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : వేములవాడ నిత్యాన్నదాన ట్రస్టుకు టీఎన్జీవో కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్ లక్ష రూపాయలు విరాళం అందించారు. కుటుంబ సమేతంగా బుధవారం ఆలయాన్ని దర్శించుకున్న ఆయన అధికారులకు విరాళాన్ని అందజేశారు.