Minister Gangula | 31న కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ : మంత్రి గంగుల
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణంలో టీటీడీకి కెటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు.
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణంలో టీటీడీకి కెటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు. మే 31న భూమి పూజను నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు భాస్కర్‌రావుతో కలిసి శుక్రవారం తిరుమలలోని టీటీడీ(TTD) పరిపాలన భవనంలో ఈవో ధర్మారెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు.

కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Venkateshwar Swamy) ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ అద్భుతంగా ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. భూమి పూజకు ముందుగా మే 22న టీటీడీ అర్చకులు భూకర్షణం నిర్వహిస్తారని ఈవో తెలిపారు. గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్ని, నవధాన్యాలు చల్లుతారని, ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారని వివరించారు. ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు.
31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి ఈవోకు తెలిపారు. ఈ కార్యక్రమంలో
జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఈఈ నరసింహమూర్తి, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

