Big Boss Fans | బస్సులపై బిగ్‌బాస్ అభిమానుల దాడి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.!
Big Boss Fans | యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్‌బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ (Amardeep) నిలిచాడు.
యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్‌బాస్ సీజన్-7 (Big Boss-7 winner) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్‌మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ (Amardeep) నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రశాంత్ విజేత అని ప్రకటించగానే సంబురాలు చేసుకున్నారు. అయితే ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న టీఎస్ఆర్టీసికి చెందిన 6 సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసి (TSRTC) ఎండి సజ్జనార్ (MD VC Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు.
”ఇదేం అభిమానం!.. బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్‌లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసికి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ” సజ్జన్నార్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

