TSRTC | హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఓ సువర్ణావకాశం అందిస్తోంది. వరంగల్‌లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్(రెండేండ్లు), మెకానిక్ డీజిల్(ఏడాది), వెల్డర్(ఏడాది), పెయింటర్(రెండేండ్లు) ట్రెడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. మోటార్ మెకానిక్ వెహికల్ ట్రేడ్‌కు పదో తరగతి అర్హత కాగా, మిగతా వాటికి 8వ తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు.
స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిప్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు.
వరంగల్‌లోని #TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు ఈ నెల ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో… pic.twitter.com/JjOooikIlR
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 23, 2023