ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు లైన్క్లీయర్
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేల( compassionate appointments )కు అనుమతి లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం సర్క్యూలర్ విడుదల చేశారు.
కొవిడ్ -19 విపత్కర పరిస్థితులు, డీజిల్, ఇతర ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో సంస్థకు అదనపు సిబ్బంది అవసరం పెరిగిందని, ఈ మేరకు 2019 నుంచి పెండింగ్లో ఉంటూ వస్తున్న కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్ – 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్లకు రూ.15వేల చొప్పున జీతాలు ఇవ్వనున్నారు. కారుణ్య నియామకాలు పొందిన సిబ్బంది మూడేళ్ల పనితీరు ఆధారంగా వారిని రెగ్యులర్ చేయనున్నారు. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించి అందులో 60శాతం మార్కులు సాధించడంతో పాటు, ప్రతి ఏడాది 240 రోజులు పనిచేసిన వారు, ప్రయాణికులతో వారి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని రెగ్యులరైజ్ చేస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీని అనుసరించి సంస్థ అవసరాల మేరకు విడతల వారీగా పోస్టులను భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

