TSPSC | హైదరాబాద్ : భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జులై 18, 19, 20, 31 తేదీల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీ విడుదల అనంతరం అభ్యంతరాలను స్వీకరించి, ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం మేరకు ఫైనల్ కీని విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.