NIC Jobs | నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (NIC) సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఎ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 376 పోస్టులను నింపనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాలు, ఖాళీలు
సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఎ 376 ఖాళీలను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 300, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 26, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో 50 పోస్టులను నింపనున్నారు.

Nic Posts
అర్హతలు
సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎంఎస్, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. దీంతో పాటు వ్యాలిడ్ గేట్ (GATE) స్కోర్ కలిగి ఉండాలి. వయసు 30 ఏండ్ల వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15, ఓబీసీ దివ్యాంగులకు 13 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక
ఎన్ఐసీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ (Registration) చేసుకున్న అభ్యర్థుల గేట్ 2024, 25, 26 స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. సమాన స్కోర్ వచ్చినవారి పాత సంవత్సర గేట్ ర్యాంక్‌ను ఆధారం చేసుకుంటారు. ఇవి కూడా సమానంగా ఉంటే విద్యార్హతల్లో అధిక మార్కులు వచ్చినవారిని ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ. 35,400 నుంచి 1,12,400 వరకు ఇస్తారు.
ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 30. ఇతర వివరాలకు వెబ్సైట్ https://recruitment.nic.inను చూడండి.