Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు. పల్లెచెరువు సమీపంలోని హయత్ హోటల్ నుంచి దుర్గానగర్ రోడ్డువైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. అలీనగర్‌కు చెందిన మహమ్మద్ ఖాజీ సోహెల్ (25) బుచ్చర్గా పనిచేస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అతనిపై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోహెల్‌పై కత్తితో దాడి చేశారు. కడుపు, ఛాతీ వెనుక భాగంలో కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన సోహెల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సోహెల్‌పై గతంలో ఉన్న కేసులు, అతనితో వివాదాలు ఉన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను త్వరలో గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

