హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతె లంగాణ): ప్రభుత్వశాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసిం ది. హాల్టికెట్లును వెబ్సైట్లో పొందుపరచగా, ఆదివారం నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూప్-3 పరీక్షలను ఈనెల 17, 18న నిర్వహించనున్నారు. 17న మొదటి సెషన్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, రెండో సెషన్లో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2కు పరీక్షలు నిర్వహిస్తారు. 18న మొదటి సెషన్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-3కి పరీక్ష నిర్వహిస్తారు. దీంతో గ్రూప్-3 పరీక్షలు ముగుస్తాయి. 2022 డిసెంబర్ 30న 1,363 పోస్టుల భ ర్తీకి గ్రూప్-3 నోటిఫికేషన్ను జారీచేశారు. టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం సెషన్లో 9:30 గంటలకు, మ ధ్యాహ్నం సెషన్లో 2:30 గంటలకే పరీక్షాకేంద్రాల గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత వస్తే అస్సలు అనుమతించరు.