హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్సెట్) హాల్టికెట్లు శుక్రవారం నుంచి www.telanganaset.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు కన్వీనర్ డీ రవీందర్ తెలిపారు. అభ్యర్థులు చివరి నిమి షం వరకు వేచిచూడకుండా, ముందుగానే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28, 29, 30 తేదీల్లో సెట్ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.