ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 14: టీఎస్ సెట్2022 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెట్ కోడ్‌ను ఓయూ వీసీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, సెట్ సభ్య కార్యదర్శి మురళీకృష్ణ, కోఆర్డినేటర్ నరేశ్‌రెడ్డి విడుదల చేశారు. ఉదయం పరీక్షకు 80.2 శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా, మధ్యాహ్నం 83 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్టు అధికారులు వెల్లడించారు.