పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగానే తాము డీజిల్ సెస్‌ను విధిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకే.. డీజిల్ సెస్‌ను విధిస్తున్నామని, ప్రజలందరూ దీనిని అర్థం చేసుకొని, యథావిథిగా సంస్థకు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజాగా.. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ టిక్కెట్ల రేట్లను పెంచింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో టిక్కెట్ ఛార్జీ 2 రూపాయలకు పెంచారు. ఇక.. సిటీ మెట్రో, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో 5 రూపాయలకు పెంచారు. మరోవైపు అన్ని బస్సు సర్వీసుల్లో కనీస ధర 10 రూపాయలుగా నిర్ణయించారు. శనివారం నుంచే ఈ ధరలు అమలు కానున్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థ ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రబావాన్ని చూపుతున్నాయని, అందుకే ప్రయాణికులపై డీజిల్ సెస్‌ను విధిస్తున్నామని సంస్థ పేర్కొంది.