హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమినరీ కీ మంగళవారం విడుదలైంది. www.tslprb.inలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి కీ అందుబాటులో ఉంటుందని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ లాగిన్ ఐడీతో వెబ్సైట్లోకి వెళ్లి అభ్యంతరం ఉన్న ప్రశ్న, అందుకు తగిన ఆధారాలను పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మెట్లో వెబ్సైట్లో సూచించిన విధానంలో అప్లోడ్ చేయాలని తెలిపారు. అభ్యంతరాలు అప్లోడ్ చేసేందుకు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు తుది గడువు ఉంటుందని పేర్కొన్నారు.
58 మార్కులు వచ్చినా తర్వాతి దశకు అర్హులే..
ప్రిలిమినరీ కీ ప్రకారం.. రెండు ప్రశ్నలకు ఏదైనా ఆప్షన్ సమాధానంగా ఇచ్చినా, ఇవ్వకపోయినా 2 మార్కులు కలువనున్నాయి. అం టే 58 మార్కులు వచ్చిన అభ్యర్థులు సైతం తర్వాతి దశకు అర్హులుకానున్నారు. బుక్లెట్ ఏ లో 56వ, 129వ ప్రశ్నలకు సమాధానం నాలు గు ఆప్షన్లతోపాటు అసలు సమాధానం పెట్టనివారికి సైతం మార్కు కేటాయించనున్నారు. 68వ, 76వ ప్రశ్నలకు ఆప్షన్ 4 పెట్టినా లేదా ఏమీ పెట్టకుండా ఉన్నవారికి సైతం మా ర్కు కేటాయిస్తారు. 158వ ప్రశ్నకు 1, 3 ఆప్ష న్లు పెట్టినా లేదా అసలు ఎలాంటి ఆప్షన్ పెట్టనివారికి సైతం మార్కు కేటాయించనున్నారు. బుక్లెట్ బీలో 51, 120 ప్రశ్నలకు ఆప్షన్ ఇచ్చినా, ఇవ్వకున్నా మార్కులు దక్కనున్నాయి. 57, 136 ప్రశ్నలకు ఆప్షన్ 4 పెట్టినా లేదా ఆప్షన్ పె ట్టకపోయినా సమాధానం సరైనదిగానే మార్కు కేటాయిస్తారు. 186వ ప్రశ్నకు ఆప్షన్ 1, 3 పెట్టి నా లేదా ఏదీ పెట్టకపోయినా మార్కు ఇస్తారు. బుక్లెట్ సీలో 69, 158 ప్రశ్నలకు ఏదైనా ఆప్షన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మార్కులు కేటాయిస్తా రు. 54, 105 ప్రశ్నలకు ఆప్షన్ 4 లేదా అసలు సమాధానం పెట్టకపోయినా మా ర్కు కేటాయిస్తారు. బుక్లెట్ డీలో 55, 162 ప్రశ్నలకు నాలుగింటిలో ఏదైనా ఆప్షన్ పెట్టినా, అసలు ఆప్షన్ ఇవ్వనివారికి సైతం మార్కు ఇస్తారు. 72, 86 ప్రశ్నలకు ఆప్షన్ 4 పెట్టినా, లేదంటే ఎలాంటి ఆప్షన్ పెట్టకపోయినా మా ర్కు వేస్తారు. 151 ప్రశ్నకు 1, 3 ఆప్షన్లు ఇచ్చినవారితోపాటు అసలు ఎలాంటి ఆప్షన్ ఇవ్వనివారికి సైతం ఒక మార్కు కలువనున్నది.