హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS PECET) 2022 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఆగస్టు 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తులను సమర్పించొచ్చని పీఈసెట్ కన్వీనర్ వెల్లడించారు. డీపీఎడ్, బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం https://pecet.tsche.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.