Lawcet 2023 | రేపట్నుంచి లాసెట్ 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ నెల 19వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు వెల్లడించారు.
మూడేండ్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 6,894 సీట్లు ఉండగా.. 5,912 మందికి తొలి విడత సీట్లు కేటాయించారు. వీరిలో 65 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఈ క్రమంలో చివరి విడత కౌన్సెలింగ్లో 40 శాతం సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.