నయీంనగర్ : టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల నిమిత్తం జూలై 27, 28వ తేదీల్లో నిర్వహిచిన టీఎస్ ఐసెట్ -2022 ఫలితాలను ఐసెట్ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రమేశ్ శనివారం కామర్స్ కళాశాల సెమినార్‌హాల్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షకు 75,954 మంది పరీక్షకు హాజరవగా.. 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐసెట్ ప్రవేశ పరీక్షలు 89.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. మరిన్ని వివరాలు https://icet.tsche.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాజిరెడ్డి, రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య వరలక్ష్మి, ఆచార్య అమరావేణి, ఆచార్య శ్రీనివాసరావు, ఆచార్య వాసుదేవరెడ్డి, డాక్టర్ నరసింహ పాల్గొన్నారు.
1వ ర్యాంక్ – దంతాల పూజిత్వర్ధన్, (గోరంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
2వ ర్యాంక్ – అంబవరం ఉమేశ్ చంద్రరెడ్డి (ముతరాసపల్లి, కడప, ఆంధ్రప్రదేశ్)
3వ ర్యాంక్ – కాట్రగడ్డ జితిన్‌సాయి (రేపల్లె, గుంటూరు)
4వ ర్యాంక్ – ఎలిశాల కార్తీక్ (కేసముద్రం, మహబూబాబాద్, తెలంగాణ)
5వ ర్యాంక్ – ధర్మాజీ సతీశ్కుమారు, హజిపూర్, మంచిర్యాల, తెలంగాణ)
6వ ర్యాంక్ – మైలవరపు అభినవ్ (బొందలగడ్డ, హైదరాబాద్)
7వ ర్యాంక్ – నవనీస కంపరాజు (కాచిగూడ, హైదరాబాద్)
8వ ర్యాంక్ – ఎజ్జగిరి హరిప్రసాద్ (శివనగర్, వరంగల్)
9వ ర్యాంక్ – నారాల మనీషారెడ్డి (కామారెడ్డి)
10వ ర్యాంక్ – తిరువీది సువర్ణ సాత్విక( జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రదేశ్)
11వ ర్యాంక్ – మారం శివప్రసాద్ (నారెట్‌పల్లి, నల్గొండ)
12వ ర్యాంక్ – నంగు గంగోత్రి (సీతాఫల్మండి, సికింద్రాబాద్)
13వ ర్యాంక్ – గంగిడి మేఘనారెడ్డి (చికడపల్లి, హైదరాబాద్)
14వ ర్యాంక్ – అలోనీ నీరజ్ (ఉప్పల్, హైదరాబాద్)
15వ ర్యాంక్ – ఇరువంటి సంతోష్‌కుమార్ (సూర్యాపేట)
16వ ర్యాంక్ – మున్ననురు చింటు (రాజవరం, నల్గొండ)
17వ ర్యాంక్ – పాలంకి కృష్ణసిద్దార్థ (బొబ్బిలి, విజయనగరం)
18వ ర్యాంక్ – నిధిసింగ్లా (గచ్చిబౌలి, హైదరాబాద్)
19వ ర్యాంక్ – కుప్పా ఆదిత్య (మలాజిగిరి)
20వ ర్యాంక్ – బొమ్మి వెంకటవిజ్జి భరద్వాజ్ (బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్).