TS EdCET | టీఎస్ ఎడ్‌సెట్ – 2022 మొదటి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ మేరకు టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు. తొలి విడుతలో 16,664 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, 10,053 సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు 14,285. కాగా 4,232 సీట్లు మిగిలాయి.
అయితే తొలి విడుతలో సీట్లు పొందిన అభ్యర్థులు.. జాయినింగ్ లెటర్, చలాన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ట్యూషన్ ఫీజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లించాలని చెప్పారు. ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు చలాన్, జాయినింగ్ రిపోర్టు తీసుకొని సంబంధిత కాలేజీల్లో ఈ నెల 5 నుంచి 11వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. నవంబర్ 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.