హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రేపట్నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్లు బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు.. 9 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 17వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. తదితర వివరాల కోసం tsecet.nic.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.