హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. యూజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. 21 నుంచి 23వ తేదీ మధ్యలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
అక్టోబర్ 26న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ మధ్యలో ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అప్పుడే ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 27న ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.