TS EAMCET Results | టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు.
సనపాల అనిరుధ్(విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
Emacet Engineering