రేపటి నుంచి ఎంసెట్
- 18, 19, 20 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షలు
- హాజరుకానున్న 1.72 లక్షల మంది విద్యార్థులు
- నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో 18, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,72,241 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షలకు 108 కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మూడు రోజులపాటు ఆరు సెషన్లల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్తోపాటు 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రికల్చర్, మెడిల్ పరీక్షలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు
- విద్యార్థులు పరీక్ష కేంద్రం లొకేషన్, రూట్‌ను సరిచూసుకోవాలి.
- విద్యార్థులను గంట 15 నిమిషాల ముందు కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
- కేంద్రాల్లో నిమిషం ఆలస్యం నిబంధనను పక్కాగా అమలుచేస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తుతోపాటు రఫ్‌వర్క్ పేపర్లను ఇన్విజిలేటర్లకు ఇవ్వాలి.
- పరీక్షకు ముందు విద్యార్థి కుడిచేయి వేలి ముద్రను తీసుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- TS EAMCET 2022
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

