DSP Transfers | రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సీఐడీ విభాగం డీఎస్పీగా పని చేస్తున్న ఎల్ రాజా వెంకట్ రెడ్డిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న అసిఫ్ నగర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ ఫయాజ్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న గోల్కొండ ఏసీపీగా బదిలీ చేశారు.
పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న అథి సుధాకర్‌ను ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ ఫలక్‌నుమా ఏసీపీగా నియమించారు. అక్కడ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న గొల్ల రమేశ్‌ను ఛత్రినాక ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మహ్మద్ మాజీద్ ను ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీఎస్పీఏ డీఎస్పీగా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న డీఎస్పీ ఎం సుదర్శన్ ను డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీ డీఎస్పీగా నియమించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఏసీపీగా పని చేస్తున్న సామల వెంకట్ రెడ్డికి ఇంతకుముందు హైదరాబాద్ సీటీ ఎస్బీ ఏసీపీగా చేసిన బదిలీని రద్దు చేశారు. తిరిగి మేడ్చల్ ఏసీపీగా సామల వెంకటరెడ్డిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ ఏసీపీగా ఎం శ్రీధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేశారు. ఖమ్మం సీటీసీ ఏసీపీగా నియమించినా.. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న డీఎస్పీ సీహెచ్ఆర్వీ ఫణీందర్ ను మెదక్ ఎస్డీపీవోగా నియమించారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న కే సైదులును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న సీహెచ్ దేవా రెడ్డిని ఖాళీగా ఉన్న టీఎస్పీఏ డీఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న తాళ్లపల్లి సత్యనారాయణను ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇంటెలిజెన్స్ డీఎస్పీగా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఏఆర్ డీఎస్పీ డీ ధనలక్ష్మిని ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్ సిటీ వెస్ట్ సెంట్రల్ ట్రాఫిక్-4 ఏసీపీగా నియమించారు.
జయశంకర్ భూపాలపల్లి డీసీఆర్బీ డీఎస్పీగా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న సెరి గిరి ప్రసాద్ ను ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పని చేస్తున్న కొమ్మెర శ్రీనివాసరావును రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా నియమించారు.
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న శ్యామ్ సుందర్ సింగ్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఎస్బీ ఏసీపీగా నియమితులైనా పోస్టింగ్ కోసం వెయింటింగ్ లో ఉన్న బీ రవీంద్ర రెడ్డిని హైదరాబాద్ సిటీ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా బదిలీ చేశారు. సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా పని చేస్తున్న బీ శ్రీనివాసరావును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.