హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా కటకం రమేశ్, ప్రధానకార్యదర్శిగా కావలి అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూతన కార్యవర్గం ఎన్నికైంది.
గౌరవ అధ్యక్షుడిగా మానేటి ప్రతాప్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్‌గా లక్కిరెడ్డి సంజీవరెడ్డి, ఉభయ తెలుగు రాష్ర్టాల కోకన్వీనర్‌గా విష్ణుమూర్తిని ఎన్నుకొన్నారు. కటకం రమేశ్ మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.