మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:49:23

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై కేటీఆర్ దిశానిర్దేశం

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై కేటీఆర్ దిశానిర్దేశం

హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట‌రు న‌మోదు ఇంఛార్జిల‌తో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్ల న‌మోదుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

పంచాయ‌తీ నుంచి అసెంబ్లీ వ‌ర‌కు అన్ని ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. రాష్ర్టంలో ప్ర‌తీ కుటుంబానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఫ‌లాలు అందుతున్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే వివిధ నియామ‌క ప్ర‌క్రియ‌ల ద్వారా దాదాపు ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని చెప్పారు. ప్ర‌యివేటు రంగంలో రూ. 2 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించామ‌ని గుర్తు చేశారు. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం ద్వారా 15 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించామ‌ని తెలిపారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పాల‌న‌లో అపూర్వ‌మైన సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌న్నారు. 60 ఏళ్ల ఫ్లోరైడ్ ర‌క్క‌సిని ఆరేళ్ల‌లో త‌రిమేశామ‌న్నారు. రాష్ర్ట ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నారు. ప్ర‌తిప‌క్షాలు దివాళా తీశాయ‌ని, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ ఘ‌న విజ‌యం సాధించేందుకు కృషి చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. 


logo