హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు వెల్లడించారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 25న హెచ్ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో కోలాహలం నెలకొన్నది.
TRS Presidential Election schedule released