శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 11:32:06

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే: మ‌ంత్రి హ‌రీశ్ రావు

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే: మ‌ంత్రి హ‌రీశ్ రావు

మెద‌క్‌: ఉమ్మ‌డి నిజామ‌బాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని, దుబ్బాక ఉపఎన్నిక‌లో కూడా ఇవే ఫ‌లితాలొస్తాయ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. మెద‌క్ జిల్లా చేగుంట వైస్ ఎంపీపీ, బీజేపీ నేత రామ‌చంద్రం మంత్రి స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంత‌య్యాయ‌ని చెప్పారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఇదే జ‌రుగుతుంద‌న్నారు. ఎమ్మెల్సీ ఫ‌లితాల‌తో కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్‌ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబ‌ద్ధాల‌ని రుజువ‌య్యాయ‌ని చెప్పారు. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ.. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.